నేడు గుజరాత్ వర్సెస్ ముంబై ఫైట్...పాండ్య వచ్చేస్తున్నాడు ?

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవాళ మరో రసవత్తర ఫైట్ జరగబోతుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవ

నేడు గుజరాత్ వర్సెస్ ముంబై ఫైట్...పాండ్య వచ్చేస్తున్నాడు  ?
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవాళ మరో రసవత్తర ఫైట్ జరగబోతుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Gujarat Titans vs Mumbai Indians ) మధ్య 9వ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైట్ ఉండనుంది. ఎప్పటిలాగే రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఏడు గంటల సమయంలో టాస్ ఉంటుంది.

అయితే ఇవాల్టి మ్యాచ్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా... హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) రంగంలోకి దిగబోతున్నాడు. మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగలేదు హార్దిక్ పాండ్యా. గత సీజన్ లో పడిన పెనాల్టీ కారణంగా ఒక మ్యాచ్ వేటు పడింది. దీంతో ముంబై ఇండియన్స్ ఆడిన మొదటి మ్యాచ్ కు దూరమయ్యాడు పాండ్యా. ఈ తరుణంలోనే సూర్య కుమార్ యాదవ్ మొదటి మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరించారు. అయితే ఇవాల్టి మ్యాచ్ కు... హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

ముంబై వర్సెస్ గుజరాత్ రికార్డులు

ముంబై వర్సెస్ గుజరాత్ మధ్య ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు జరిగాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్లోనే విజయం సాధించడం జరిగింది. అంటే ఈ లెక్కన ఇవాల్టి మ్యాచ్ లో కూడా గుజరాత్ టైటాన్స్ హాట్ ఫేవరెట్ గా ఉండనుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Next Story