- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2025: ఇదే జరిగితే... RCB టైటిల్ కొట్టడం పక్క.. రాసి పెట్టుకోండి !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) నేరుగా ఫైనల్స్ కు దూసుకువెళ్లింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) నేరుగా ఫైనల్స్ కు దూసుకువెళ్లింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB). క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో అదరగొట్టిన బెంగళూరు జట్టు... నాలుగో సారి ఫైనల్ కు చేరుకుంది. అయితే ఫైనల్ కు చేరుకున్న బెంగళూరు జట్టుకు అదిరిపోయే శుభవార్త అందింది. గత ఏడు సంవత్సరాలుగా వస్తున్న సెంటిమెంట్ ప్రకారం... టైటిల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వరిస్తుందని లెక్కలు చెబుతున్నాయి.
గడిచిన ఏడు సంవత్సరాల ఐపిఎల్ సీజన్ లలో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ గెలిచిన జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈసారి కచ్చితంగా మాదే కప్ అంటూ... సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
2018 నుంచి 2024 ఐపీఎల్ టోర్నమెంట్ ల వరకు... క్వాలిఫైయర్ 1 గెలిచిన జట్టు టైటిల్ గెలుస్తుందని.. గత లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్క ప్రకారం.. గురువారం రోజున పంజాబ్ జట్టు పైన ( punjab kings) క్వాలిఫైయర్ 1 లో ( qualifier 1) గ్రాండ్ విక్టరీ కొట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అంటే ఫైనల్స్ లో కూడా బెంగళూరు విజయం సాధించి మొట్టమొదటి టైటిల్ అందుకోబోతుందని.. లెక్కలు చెబుతున్నాయి. మరి ఇది ఎంత మేరకు వాస్తవం అవుతుందో చూడాలి.






