IPL 2023 : టాప్ 5 బ్యాటింగ్ పర్ఫామెన్సెస్ ఇవే..

by Rajesh |
IPL 2023 : టాప్ 5 బ్యాటింగ్ పర్ఫామెన్సెస్ ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు నెలలుగా క్రికెట్ లవర్స్‌ను ఉర్రూతలూగించిన ఐపీఎల్ సీజన్ రేపటితో ముగియనుంది. ఐపీఎల్ -2023 ఫైనల్ లో భాగంగా రేపు చెన్నై, గుజరాత్ తలపడనున్నాయి. కొంత మంది బ్యాట్స్ మెన్స్ ఆడిన ఇన్నింగ్స్ ఈ సీజన్‌లో మెమొరబుల్ గా నిలిచాయి. వాటిలో టాప్ 5 బ్యాటింగ్ పర్ఫామెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముంబై తో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ 129 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో గుజరాత్ టైటన్స్ ఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తన సూపర్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు.





ఎస్ఆర్‌హెచ్‌తో ఆడిన మ్యాచ్‌లో శిఖర్ దావన్ పరుగులు చేసి 99 నాటౌట్‌గా నిలిచాడు. ఓ దశలో పీబీకే‌ఎస్ 88 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోగా ఒంటి చేత్తో జట్టుకు గౌరవ ప్రద స్కోరు అందించాడు. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోయిన అందరూ గబ్బర్ ఆటతీరుకు ఫిదా అయ్యారు.




గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ చేసిన 92 పరుగులు కూడా ఈ సీజన్‌లో మరుపురాని ఇన్నింగ్స్‌గా నిలిచింది. గాయం నుంచి కోల్కొని రుతురాజ్ ఆడిన ఇన్నింగ్స్‌తో టీం ఇండియాలో ఈ ఆటగాడికి స్థానం గురించి చర్చ మొదలైంది.




ముంబై బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ ఆర్సీబీతో మ్యాచ్‌లో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముంబై జట్టులో మిడిల్ ఓవర్స్ వేగంగా పరుగులు చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.





బౌలర్ గా కెరీర్ ప్రారంభించిన శార్దుల్ ఠాగూర్ ఈ సీజన్ ఆర్సీబీతో ఆడిన మ్యాచ్ లో చేసిన 68 పరుగులు ఆకట్టుకున్నాయి. కాన్ఫిడెన్స్ తో అతను కొట్టిన షార్ట్ లకు క్రికెట్ లవర్స్ ఫిదా అయ్యారు. ఈ ఇన్నింగ్స్ శార్దుల్ మెరుపు ఇన్నింగ్స్‌తో కేకేఆర్ ను గెలిపించి ఆర్సీబీకి బిగ్ షాక్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి: 2023 టాటా IPL విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?

Next Story

Most Viewed