Coach Nagapuri Ramesh : అంతర్జాతీయ అథ్లెటిక్ కోచ్ రమేష్ సస్పెన్షన్

by Muthe.Rajitha |

భారత అంతర్జాతీయ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్(Caoch Nagapuri Ramesh) కు భారీ షాక్ తగిలింది.

Coach Nagapuri Ramesh : అంతర్జాతీయ అథ్లెటిక్ కోచ్ రమేష్ సస్పెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత అంతర్జాతీయ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్(Caoch Nagapuri Ramesh) కు భారీ షాక్ తగిలింది. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(NADA) అధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. నాగపురి రమేష్ వద్ద కోచింగ్ తీసుకున్న పలువురు క్రీడాకారులు డోప్ టెస్టు(Doping Test)కు నిరాకరించారు. డోప్ టెస్టుకు పరాస్ సింఘాల్, పూజా రాణి, నలుబోతు షణ్ముగ శ్రీనివాస్, చెలిమి ప్రతుష, శుభం మహరా, కిరణ్ మరియు జ్యోతి అనే ఏడుగురు అథ్లెట్లు శాంపుల్స్ ఇవ్వడానికి నిరాకరించినట్టు అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారికి కోచింగ్ ఇచ్చిన రమేష్ తో పాటు అసిస్టెంట్ కోచ్ లు అయిన కరంవీర్ సింగ్, రాకేశ్ లపై కూడా సస్పెన్షన్ వేటు వేసింది. అదే విధంగా ఈ ముగ్గురికి భారీగా జరిమానా విధిస్తూ నాడా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా అత్యుత్తమ కోచింగ్ కు గాను నాగపురి రమేష్ కు గతంలో కేంద్ర ప్రభుత్వం ద్రోణాచార్య అవార్డు(Dronacharya Award)ను అందించింది. దీనిపై రమేష్ స్పందిస్తూ.. తాను జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదని, చేయబోనని స్పష్టం చేశారు. పేద క్రీడాకారులను అంతర్జాతీయస్థాయిలో తీర్చి దిద్దటమే తన లక్ష్యం అన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని కోచ్ రమేష్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్‌లో పనిచేస్తున్న నాగ్‌పురి రమేష్, 2023లో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) ద్వారా జూనియర్ చీఫ్ కోచ్‌గా నియమితులయ్యారు.

Next Story