- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసక్తికరంగా ఐపీఎల్ - 2026 వేలం.. ఫ్రాంచైజీల చూపు ఆ ప్లేయర్లపైనే
అబుదాబి (Abu Dhabi) వేదికగా ఈ నెల 16న జరగనున్న మినీ వేలం ఆసక్తికరంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: అబుదాబి (Abu Dhabi) వేదికగా ఈ నెల 16న జరగనున్న మినీ వేలం ఆసక్తికరంగా మారింది. ఇందులో మొత్తం 1,355 మంది ప్లేయర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా.. ఆ జాబితాను 350 మందికి కుదించారు. ఈ క్రమంలోనే ఆయా జట్ల ఫ్రాంచైజీలు భారత అన్‌క్యాప్డ్ ఆటగాళ్లపై ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం కొనసాగుతోన్న టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy)లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా వేలంలో పలువురు ఆటగాళ్లు భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఇప్పుడు వారు ఎవరో చూద్దాం.
మొదటగా జమ్మూ కశ్మీర్‌కు చెందిన పేసర్ అకిబ్ నబీ (Aqib Nabi) ధర మినీ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు 7.41 ఎకానమీతో 15 వికెట్లు తీశాడు. 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 125 వికెట్లు పడగొట్టాడు.అదేవిధంగా కార్తీక్ శర్మ (Karthik Sharma)ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ఈ కీపర్-బ్యాట్స్‌మెన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల్లో 160 స్ట్రైక్‌రేట్‌తో 133 పరుగులు చేశాడు. భారీ షాట్లు ఆడే సత్తా అతడి సొంతం. తమిళనాడుకు చెందిన తుషార్ రహేజా (Tushar Raheja) సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు ఓపెనర్, వికెట్ కీపర్‌గా బరిలోకి దిగిన తుషార్ రహేజా 7 మ్యాచ్‌ల్లో 164 స్ట్రైక్‌రేట్‌తో 151 పరుగులు చేశాడు. అదేవిధంగా పంజాబ్‌కు చెందిన అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (Anmolpreet Singh)కు దేశీయ క్రికెట్‌లో మెరుగైన రికార్డు ఉంది. ఇదే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 172 స్ట్రైక్‌రేట్‌తో 241 పరుగులు చేశాడు. చివరగా రాజస్థాన్‌కు చెందిన అశోక్ శర్మ (Ashok Sharma) కూడా భారీ ధర పలికే అవకాశం ఉంది. ఈ 23 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు.






