బుమ్రాకు గాయం..టెన్షన్ లో ముంబై ఇండియన్స్ !

by velandi.Saikiran |

ఐపీఎల్ 2026 కంటే ముందు ముంబై ఇండియన్స్ బౌలింగ్ పెద్దన్న బుమ్రా గాయం బారిన పడినట్లు వార్తలు వస్తున్నాయి.

బుమ్రాకు గాయం..టెన్షన్ లో ముంబై ఇండియన్స్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 కంటే ముందు ముంబై ఇండియన్స్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలేలా క‌నిపిస్తోంది. బౌలింగ్ పెద్దన్న బుమ్రా ( Jasprit Bumrah) గాయం బారిన పడినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు బుమ్రా వెళ్లిన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభం కంటే ముందే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు బుమ్రా వెళ్ళిన నేపథ్యంలో అతనికి గాయమైందని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే నిజంగానే బుమ్రాకు గాయమైనట్లు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

కొంతమంది ప్లేయర్లు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు వెళ్లి రొటీన్ చెకప్ చేయించుకుంటారు. అందులో భాగంగానే బుమ్రా వెళ్లాడా ? లేక అతనికి నిజంగా ఏదైనా గాయం అయిందా ? అనే వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై ముంబై ఇండియన్స్ యాజమాన్యం స్పందిస్తే తప్ప అసలు నిజం బయటకు రాదని అంటున్నారు క్రీడా విశ్లేష‌కులు. ఒక‌వేళ బుమ్రా మాత్రం గాయం బారిన ప‌డితే, ముంబైకి ఎదురుదెబ్బ త‌గిలే ప్ర‌మాదం ఉంది. కాగా ఆదివారం కేకేఆర్ తో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ ఉంది. ఈ టోర్నమెంట్ మార్చి 28వ తేదీన బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ తో ప్రారంభం కానుంది. ఎన్నికలు, యుద్ధం ఇలాంటివి ఎన్ని వచ్చినా తమ టోర్నమెంట్ షెడ్యూల్ ప్ర‌కారమే కొనసాగుతుందని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.

Next Story