Ind vs SA: మిల్లర్ తో రీల్స్‌..ఆ లేడీని రేప్ చేస్తామంటూ బెదిరింపులు!

by velandi.Saikiran |

మిల్ల‌ర్ తో రీల్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రిన్సీ పారిఖ్ పై నెటిజ‌న్లు సీరియ‌స్ అయ్యారు. రేప్ చేస్తామ‌ని బెదిరించారు.

Ind vs SA:  మిల్లర్ తో రీల్స్‌..ఆ లేడీని రేప్ చేస్తామంటూ బెదిరింపులు!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో వారం రోజులైతే సెమీ ఫైనల్ పోరు కూడా మొదలు కానుంది. అయితే సూపర్ 8 లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికా, భారత జ‌ట్ల‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడి, ఇండియాను ఓడించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో 63 పరుగులు చేసి, ఆకట్టుకున్నాడు డేవిడ్ మిల్లర్. అతని కారణంగా భారత్ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత డేవిడ్ మిల్లర్ తో ( davidi miller) సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రిన్సీ పారిఖ్ ( RJ Princy Parikh) ఓ రీల్ చేశారు. ఈ వీడియో రెండు రోజులుగా వైరల్ అవుతోంది.

మిల్లర్‌తో రీల్.. రేప్ చేస్తామంటూ బెదిరింపులు!

ఈ తరుణంలోనే డేవిడ్ మిల్లర్ తో వీడియో చేసినందుకు గాను ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రిన్సీ పారిఖ్ పై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేశారు నెటిజెన్స్. అంతేకాదు బాడీ షేమింగ్ కూడా చేశారని ఆమె ఫైర్‌ అయ్యారు. కొంత మంది అయితే రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని ఎమోషనల్ అయ్యారు ప్రిన్సీ పారిఖ్. దీంతో తన ఫేస్బుక్ ఖాతా నుంచి డేవిడ్‌ మిల్లర్ తో చేసిన వీడియో డిలీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ సంఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ప్రిన్సీ పారిఖ్ పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నీచపు కామెంట్లు పెట్టిన వాళ్ల అంతు చూసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ప్రిన్సీ పారిఖ్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ తో (David Miller) రీల్స్ ( Reels) చేసి పాపులర్ అయిన ప్రిన్సీ పారిఖ్, బ్యాగ్రౌండ్ గురించి ఒకసారి పరిశీలిస్తే.. ప్రిన్సీ పారిఖ్ ముంబైలోనే పుట్టి పెరిగారు. ముంబైలోనే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత డిజిటల్ క్రియేటర్ గా ఆమె మారారు. అదే సమయంలో రైటర్, రేడియో మిర్చిలో ఆర్జే గా కూడా పనిచేశారు ప్రిన్సీ పారిఖ్. ఇన్‌స్టాగ్రామ్ లో తరచూ వీడియోలు పెడుతూ పాపులర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ లో 1.7 మిలియన్ల ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మధ్య తరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రిన్సీ పారిఖ్, ఫన్నీ వీడియోలు, ఆసక్తికర సంఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండ‌గా, సూప‌ర్ 8 లో భాగంగా ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్ జ‌రిగింది. ఇందులో 76 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికా ( South Africa) చేతిలో భార‌త్ ( India) ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. ఇక రేపు జింబాబ్వేతో త‌ల‌ప‌డ‌నుంది ఇండియా.

Next Story