- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండో రౌండ్‌లో సింధు ఔట్.. సాత్విక్ జోడీ ముందుకు
ఇండోనేషియా ఓపెన్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిల జోరు కొనసాగుతోంది.

దిశ, స్పోర్ట్స్ : ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిల జోరు కొనసాగుతోంది. పురుషుల డబుల్స్‌లో ఈ జంట వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో సాత్విక్ జోడీ 16-21, 21-18, 22-20 తేడాతో డెన్మార్క్‌కు చెందిన రాస్ముస్-ఫ్రెడరిక్ జంటను చిత్తు చేసింది. గంటకు పైగా మ్యాచ్ హోరాహోరీగా సాగింది. మొదట సాత్విక్, చిరాగ్‌లకు శుభారంభం దక్కలేదు. తొలి గేమ్ ప్రత్యర్థ జంట గెలిచింది. ఆ తర్వాత బలంగా పుంజుకున్న సాత్విక్ జోడీ డెన్మార్ ద్వయం నుంచి పోటీని తట్టుకుని నిలబడింది. వరుసగా రెండు, మూడు గేముల్లో పైచేయి సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు రెండో రౌండ్‌లోనే ఇంటిదారిపట్టింది. థాయిలాండ్ షట్లర్ చొచువాంగ్ చేతిలో 22-20, 10-21, 18-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి గేమ్ నెగ్గి శుభారంభం చేసిన సింధు.. మిగతా రెండు గేముల్లో ఆ జోరును కొనసాగించలేకపోయింది. మహిళల డబుల్స్ జోడీ ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ జట్టుకు కూడా నిరాశే ఎదురైంది. రెండో రౌండ్‌లో జపాన్‌కు చెందిన మత్సుమోటో-ఫుకుషిమా జంట చేతిలో 21-13, 24-22తో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది.






