- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ICC అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ కు భారత జట్టు ఎంపీక.. తెలంగాణ యువతికి చోటు
ICC అండర్-19 2025 మహిళల T20 ప్రపంచ కప్ జనవరి 18 నుంచి ప్రారంభం కానుంది.

దిశ, వెబ్ డెస్క్: ICC అండర్-19 2025 మహిళల T20 ప్రపంచ కప్ జనవరి 18 నుంచి ప్రారంభం కానుంది. కాగా ఈ ప్రపంచ కప్ కు భారత మహిళల జట్టు(Indian Women's Team)ను మంగళవారం ఉదయం.. బీసీసీఐ(BCCI) ప్రకటించింది. ఈ యువ భారత మహిళ జట్టుకు నికి ప్రసాద్(Niki Prasad) కెప్టెన్(Captain) గా వ్యవహరించనుండగా.. సానికా చాల్కే(Sanika Chalke) వైస్ కెప్టెన్(Vice Captain) గా వ్యవహరించనుంది. మొత్తం 15 మంది ప్లేయర్లతో పాటు మరో ముగ్గురిని స్టాండ్‌బై ప్లేయర్‌లుగా బీసీసీఐ ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే ACC ఛాంపియన్ షిప్ ట్రోఫీలో విజయం సాధించిన అండర్ 19 జట్టులో.. కీలకంగా రాణించిన తెలంగాణకు చెందిన యువ ప్లేయర్ గొంగడి త్రిష(Gongadi Trisha) కు తుది జట్టులో స్థానం దక్కింది. కాగా ఈ టోర్నమెంట్ మలేషియాలో 2025 జనవరి 18 నుండి ఫిబ్రవరి 02 వరకు జరగనుంది. ఈ ప్రపంచ కప్ లో మొత్తం 4 గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూప్‌లో 4 జట్లు ఉంటాయి. గ్రూప్-Aలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న భారత్ తో పారుట ఆతిథ్య మలేషియా, వెస్టిండీస్, శ్రీలంక ఉన్నాయి. కాగా కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్ ఇండియా U19 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. ఈ ప్రపంచ కప్ లో భారత మహిళల జట్టు జనవరి 19న వెస్టిండీస్ జట్టుతో ఆడనుంది.
భారత జట్టు: నికి ప్రసాద్ (కెప్టెన్), సానికా చాల్కే (వైస్ కెప్టెన్), జి త్రిష, కమలిని జి (డబ్ల్యూకే), భావికా అహిరే (డబ్ల్యూకే), ఈశ్వరి అవసరే, మిథిలా వినోద్, జోషిత వీజే, సోనమ్ యాదవ్, పరుణికా సిసోడియా, కేసరి దృతి, ఆయుషి శుక్లా, ఆనందిత కిషోర్, MD షబ్నం, వైష్ణవి ఎస్
స్టాండ్‌బై ప్లేయర్‌లు: నంధన ఎస్, ఇరా జె, అనాది టి






