గృహ హింస కేసులో భారత క్రికెటర్ షమీకి ఊరట..

by Malleboina Mahesh |   (  Updated:2023-03-30 03:09:41  IST  )

భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కలకత్తా హైకోర్టులో ఊరట లభించింది. తన భార్య షమీపై పెట్టిన గృహ హింస కేసులో గతంలో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

గృహ హింస కేసులో భారత క్రికెటర్ షమీకి ఊరట..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కలకత్తా హైకోర్టులో ఊరట లభించింది. తన భార్య షమీపై పెట్టిన గృహ హింస కేసులో గతంలో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. దీంతో షమీ కోర్టును ఆశ్రయించగా మేజిస్ట్రేట్ కోర్టు అతని అరెస్ట్ వారెంట్‌పై స్టే విధించింది. దీనిని సవాల్ చేస్తూ.. షమీతో విడిపోయిన భార్య హసిన్ జహాన్ కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే..షమీపై సమన్లకు బదులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం న్యాయవ్యవస్థకు విరుద్ధమని హైకోర్టు పేర్కొంది.

Next Story