టీమిండియా ఓపెనర్ ప్రాతిక రావల్‌కు జరిమానా విధించిన ఐసీసీ

by Harish |

భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ ప్రాతిక రావల్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

టీమిండియా ఓపెనర్ ప్రాతిక రావల్‌కు జరిమానా విధించిన ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ ప్రాతిక రావల్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆమె రెండుసార్లు ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించింది. భారత్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో సింగిల్ తీసేటప్పుడు ఇంగ్లాండ్ ప్లేయర్ లారెన్ ఫిలెర్‌తో దురుసుగా ప్రవర్తించింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే ఆమె అవుటవ్వగా డ్రెస్సింగ్ రూంకు వెళ్లేటప్పుడు స్పినర్ సోఫియా ఎక్లోస్టోన్‌తో కూడా అదే విధంగా ప్రవర్తించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రాతిక రావల్‌కు 10 శాతం ఫైన్ విధించడంతోపాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించింది. మరోవైపు, ఇంగ్లాండ్‌కు కూడా జరిమానా పడింది. తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత పెట్టింది. నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటా ఆ జట్టు ఒక్క ఓవర్ తక్కువగా వేసినట్టు ఐసీసీ గుర్తించింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. నేడు రెండో వన్డే జరగనుంది.


Next Story