- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
U19 ఆసియా కప్.. పాక్ పై భారత్ భారీ విజయం
by Muthe.Rajitha |
మెన్స్ U19 ఆసియా కప్ లో భారత జట్టు పాకిస్తాన్ ను మట్టికరిపించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : మెన్స్ U19 ఆసియా కప్ లో భారత జట్టు పాకిస్తాన్ ను మట్టికరిపించింది. అండర్-19 ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ను వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ బౌలర్లు అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయ్యమ్ చెరో 3 వికెట్లు తీసారు. అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ 41.2 ఓవర్లకు 150 పరుగులే చేసి ఆల్ ఔట్ అయింది. దీంతో భారత్ 90 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. పాక్ బ్యాటర్స్ లో అహ్సన్ మాత్రమే 70 రన్స్ చేసాడు. మిగిలిన వాళ్ళు పెద్దగా రాణించలేదు. ఇక భారత బౌలర్లలో దీపేశ్ 3, కనిష్క్ చౌహాన్ 3, కిషన్ సింగ్ 2, ఖిలాన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ ఒక్కో వికెట్ తీశారు.
Next Story






