అదగొట్టిన షెఫాలీ.. శ్రీలంకను చిత్తు చేసిన భారత్‌

by Gantepaka Srikanth |

అదగొట్టిన షెఫాలీ.. శ్రీలంకను చిత్తు చేసిన భారత్‌

అదగొట్టిన షెఫాలీ.. శ్రీలంకను చిత్తు చేసిన భారత్‌
X

దిశ, వెబ్‌డెస్క్: వైజాగ్ వేదికగా జరిగిన రెండో టీ20లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 129 పరుగుల లక్ష్యాన్ని 11.5 ఓవర్లలోనే ఛేదించింది. షెఫాలీ వర్మ 34 బంతుల్లోనే 69*(11 ఫోర్లు, ఒక సిక్సర్), జెమీమా 26, స్మృతి 14, హర్మన్ ప్రీత్ 10 రన్స్ చేశారు. ఈ గెలుపుతో భారత్ 5 టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది. అంతకుముందు టాస్‌ ఓడి శ్రీలంక ముందుగా బ్యాటింగ్‌ చేసింది. తొలి 10 ఓవర్లలోనే శ్రీలంక రెండు వికెట్ల కోల్పోయి.. 66 పరుగులు చేసింది. భారత బౌలర్లు విజృంభించడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఆ జట్టులో హర్షిత (33) టాప్‌ స్కోరర్‌. చమరి ఆటపట్టు (31), హాసిని పెరీరా (22) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీచరణి 2, వైష్ణవి శర్మ 2, క్రాంతి గౌడ్‌, స్నేహ్‌ రాణా ఒక్కో వికెట్‌ తీశారు.

Next Story