- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసియా చాంపియన్‌షిప్‌లో రెజ్లర్ మనీషాకు స్వర్ణం
by Harish |
ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం దక్కింది.

X
దిశ, స్పోర్ట్స్ : జోర్డాన్‌లోని అమ్మాన్‌లో జరుగుతున్న ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం దక్కింది.మహిళా రెజ్లర్ మనీషా 62 కేజీల కేటగిరీలో చాంపియన్‌గా నిలిచింది. శుక్రవారం రాత్రి జరిగిన గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో మనీషా అద్భుత ప్రదర్శన చేసింది. ఉత్తర కొరియాకు చెందిన ఒకే జె.కిమ్‌ను 8-7 తేడాతో మట్టికరిపించి బంగారు పతకం సాధించింది. అలాగే, 53 కేజీల కేటగిరీలో అంతిమ్ పంఘల్ కాంస్య పతకం దక్కించుకుంది. బ్రాంజ్ మెడల్ బౌట్‌లో ఆమె 10-0 తేడాతో కొరియాకు చెందని మెంగ్ హ్సువాన్ హ్సీహ్‌పై నెగ్గింది. దీంతో టోర్నీలో భారత్ పతకాల సంఖ్య 7కు చేరింది.
Next Story






