‘సోని స్పోర్ట్స్’ టెన్నిస్ అంబాసిడర్‌గా సానియా మీర్జా..

by Disha Web Desk 13 |
‘సోని స్పోర్ట్స్’ టెన్నిస్ అంబాసిడర్‌గా సానియా మీర్జా..
X

ముంబై: ప్రముఖ స్పోర్ట్స్ బ్రాడ్ కాస్టర్ ‘సోని స్పోర్ట్స్’ టెన్నిస్ అంబాసిడర్‌గా భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా నియమితులైంది. ఆ చానెల్ ఎక్స్ పర్ట్స్ ప్యానెలిస్ట్ లో సానియా పాల్గొంటుంది. ఆస్ట్రేలియా ఓపెన్, రొలాండ్ గ్యారోస్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ కు నిలయంగా ఉన్న సోని నెట్ వర్క్ డేవిస్ కప్‌లో భారత టెన్నిస్‌కు కూడా నిలయంగా కొనసాగుతోంది. భారత టెన్నిస్‌కు మారుపేరుగా నిలిచిన సానియా మీర్జా ఆరు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు (రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్, రెండు యూఎస్ ఓపెన్, ఒక రొలాండ్ గ్యారోస్, ఒక వింబుల్డన్) సాధించింది. అందులో మూడు మహిళా డబుల్స్, మూడు మిక్స్ డ్ డబుల్స్ టైటిళ్లు ఉన్నాయి. ఇప్పటికే సోని స్పోర్ట్స్ నెట్ వర్క్స్ ఎక్స్ ట్రా సెర్వ్ లో తన టెన్నిస్ పాండిత్యాన్ని ప్రేక్షకులతో పంచుకుంటున్న సానియా ఈ నెల 28వ తేదీన ప్రారంభమయ్యే రొలాండ్ గ్యారోస్ గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్ ద్వారా సోని స్పోర్ట్స్ నెట్ వర్క్ లో టెన్నిస్ అభిమానులను అలరించనుంది.

‘హోం ఆఫ్ టెన్నిస్’ పేరుతో ప్రత్యేక కారక్రమం..

‘హోం ఆఫ్ టెన్నిస్’ పేరుతో సోని స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. సానియా మీర్జా, సోని స్పోర్ట్స్ నెట్ వర్క్, మూడు గ్రాండ్ శ్లామ్స్‌లో ఆమె ఆటను ప్రదర్శిస్తారు. తొలి చిత్రంలో సోని స్పోర్ట్స్ నెట్ వర్క్‌తో భాగస్వామ్యం గురించి సానియా వివరిస్తుంది. క్లే కోర్టు అయిన రొలాండ్ గ్యారోస్‌లో తన ప్రతిభను రెండో చిత్రంలో వివరిస్తుంది. మూడు గ్రాండ్ శ్లామ్స్ (ఆస్ట్రేలియన్ ఓపెన్, రొలాండ్ గ్యారోస్, యూఎస్ ఓపెన్) లకు సోని స్పోర్ట్స్ నెట్ వర్క్ నిలయం అనే విషయాన్ని సానియా వివరిస్తుంది. యూఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌లో తన ప్రతిభపై నాలుగో చిత్రంలో సానియా వివరిస్తుంది.

Next Story

Most Viewed