- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BCCI: భారత జట్టు ప్రకటన.. ఇద్దరు తెలుగు ప్లేయర్లకు చోటు
ఇంగ్లండ్(England)లో టీ20 సిరీస్‌కు బీసీసీఐ(BCCI) భారత జట్టు(Team India)ను ఎంపిక చేసింది. శనివారం జట్టును అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్(England)లో టీ20 సిరీస్‌కు బీసీసీఐ(BCCI) భారత జట్టు(Team India)ను ఎంపిక చేసింది. శనివారం జట్టును అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ జట్టులో ఇద్దరు తెలుగు ప్లేయర్లు(Telugu Players) చోటు దక్కించుకున్నారు. ఈనెల 22వ తేదీ నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచుల టీ20 సీరిస్(T20 Series) ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతా వేదికగా జరుగనుంది.
జట్టు: సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, నితిశ్ రెడ్డి, ద్రువ్ జురేల్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, వరుణ్ దావన్, వాషింగ్టన్ సుందర్.
కాగా, ఇటీవలే టీమిండియా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ(Border - Gavaskar Trophy)ని చేజార్చుకున్నది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ ప్రతిష్టా్త్మక ట్రోఫీలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమితో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్(World Test Championship Final) నుంచి టీమిండియా నిష్క్రమించినట్లైంది. సిరీస్‌తోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును సైతం ఆస్ట్రేలియా ఖరారు చేసుకుంది.






