- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సుదీర్మన్ కప్ టోర్నీకి భారత బ్యాడ్మింటన్ బృందం ఎంపిక

దిశ, స్పోర్ట్స్ : చైనాలో ఈ నెలలో జరిగే ప్రతిష్టాత్మక సుదీర్మన్ కప్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్ టోర్నీకి భారత జట్టును బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రకటించింది. జట్టులో 14 మందిని ఎంపిక చేసింది. మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్, ఉమెన్స్ సింగిల్స్‌లో పీవీ సింధు, అనుపమ ఉపాధ్యాయ ఎంపికయ్యారు. ఆసియా చాంపియన్‌షిప్‌కు దూరమైన పురుషుల డబుల్స్ స్టార్ జంట సాత్విక్-చిరాగ్ శెట్టి తిరిగి వచ్చారు. సాత్విక్ జోడీతోపాటు హరిహరణ్-రుబాన్ కుమార్ జంట పురుషుల డబుల్స్ విభాగంలో బరిలోకి దిగనుంది. గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైంది. దీంతో యువ జంట ప్రియా-శ్రుతి మిశ్రా జంటకు భారత జట్టులో చోటు లభించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా, సతీశ్-ఆద్య జంటలు ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఈ నెల 27 నుంచి మే 4 వరకు టోర్నీ జరగనుంది. భారత్‌ను గ్రూపు డిలో చేర్చగా కఠిన ప్రత్యర్థులను ఎదుర్కోనుంది. మాజీ చాంపియన్ ఇండోనేషియా, రెండుసార్లు రన్నరప్ డెన్మార్క్, బలమైన ఇంగ్లాండ్‌తో తలపడనుంది.