ENGvsAUS: పాకిస్థాన్‌లో భారత జాతీయ గీతం.. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్‌‌ ముందు తప్పిదం

by Ramesh Naini |   (  Updated:2025-02-22 10:38:58  IST  )

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌లోని లాహోర్ స్టేడియంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

ENGvsAUS: పాకిస్థాన్‌లో భారత జాతీయ గీతం.. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్‌‌ ముందు తప్పిదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌లోని లాహోర్ స్టేడియంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. శనివారం గడాఫీ స్టేడియంలో ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా తలపడే ముందు భారత జాతీయ గీతం పొరపాటున ప్లే అయింది. మొదట ఇంగ్లండ్ జాతీయ గీతం తర్వాత ఆస్ట్రేలియా నేషనల్ ఆంథెమ్‌కు బదులుగా భారత జాతీయ గీతాన్ని కొన్ని సెకన్ల పాటు ప్లే చేశారు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు, స్టేడియంలోని ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. వెంటనే నిర్వాహకులు ఈ తప్పును గ్రహించి భారత జాతీయ గీతాన్ని ఆపివేసి.. ఆస్ట్రేలియా గీతాన్ని ప్లే చేయించారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది.

నిర్వహకుల తప్పిదంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కరాచీలోని స్టేడియంలో ఒక భారత్ తప్ప పోటీలో ఉన్న మిగతా అన్ని జట్ల జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. దీంతో పాకిస్తాన్ క్రికెట్‌ బోర్డుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే ఈవెంట్లలో మ్యాచ్‌కు ముందు, ఇరు జట్ల జాతీయ గీతాలను ప్లే చేస్తారనే విషయం తెలిసిందే. టాస్ వేసిన తర్వాత గీతాన్ని ప్లే చేస్తారు. అనంతరం ఇరు జట్లు కరచాలనం చేసుకుని పోటీకి సిద్దమవుతారు.

Next Story