మళ్లీ డోపింగ్ టెస్టులో ఫెయిలైన జావెలిన్ త్రోవర్.. 8 ఏళ్ల నిషేధం తప్పదా?

by Phanindra |

భారత జావెలిన్ త్రోవర్ మళ్లీ డోపింగ్ టెస్టులో ఫెయిలయ్యాడు. తప్పు చేసినట్లు తేలితే అతనిపై 8 ఏళ్ల నిషేధం తప్పదు.

మళ్లీ డోపింగ్ టెస్టులో ఫెయిలైన జావెలిన్ త్రోవర్.. 8 ఏళ్ల నిషేధం తప్పదా?
X

దిశ, స్పోర్ట్స్: భారత జావెలిన్ త్రోవర్ శివపాల్ సింగ్ మరోసారి డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. తప్పు చేసినట్లు తేలితే 8 ఏళ్ల పాటు అతనిపై నిషేధం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 29 ఏళ్ల శివపాల్.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కొన్నిరోజుల క్రితం తీసుకున్న అతని యూరిన్ శాంపిల్‌లో నిషేధించిన డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అతన్ని నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా) సస్పెండ్ చేసింది. నాడా, వాడా (అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ) నిబంధనల ప్రకారం, రెండుసార్లు ఏ క్రీడాకారుడైనా డోపింగ్ టెస్టులో ఫెయిలైతే వారిని 8 ఏళ్లపాటు నిషేధించే అవకాశం ఉంది.

దోహాలో జరిగిన 2019 ఆసియా ఛాంపియన్స్‌షిప్‌లో శివపాల్ రజతం సాధించాడు. 2021లో ఎలాంటి టోర్నీల్లో లేనప్పుడు శివపాల్ యాదవ్ స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో అతనిపై నాడా నాలుగేళ్ల నిషేధం విధించింది. అయితే ఈ నిషేధాన్ని అప్పీల్ ప్యానెల్ ముందు శివపాల్ సింగ్ సవాల్ చేశాడు. తను తీసుకున్న సప్లిమెంట్లలో స్టెరాయిడ్స్ కలిశాయని, ఆ విషయం తనకు తెలియదని అతను వాదించాడు. దీంతో అతనిపై నిషేధాన్ని ఒక ఏడాదికి అప్పీల్ ప్యానెల్ కుదించింది. ఇప్పుడు మళ్లీ డోపింగ్ టెస్టులో అతను ఫెయిలవడం చర్చనీయాంశంగా మారింది.

Next Story