సిలిండర్ సప్లై చేస్తున్న భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి (వీడియో)

by Disha Web Desk 4 |
సిలిండర్ సప్లై చేస్తున్న భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెటర్ రింకూసింగ్ 2023 ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 474 పరుగులు చేసి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2024 టీ-20 వరల్డ్ కప్‌లో సైతం ఈ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ చోటు దక్కించుకున్నాడు. అయితే ఒకే ఓవర్‌లో 5 సిక్స్‌లు కొట్టి రింకూసింగ్ కేకేఆర్‌కు 2023 సీజన్‌లో సూపర్ విక్టరీ సైతం అందించాడు. రింకూ సింగ్ కెరీర్‌లో ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు అందుకుంటున్నా తన తండ్రి ఖాన్ చంద్రాసింగ్ మాత్రం గృహ అవసరాల కోసం ఎల్పీజీ సిలిండర్లను సప్లై చేస్తున్నాడు. యూపీలో జరిగిన ఈ ఘటనకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ సందర్భంలో రింకూ సింగ్ మాట్లాడుతూ.. తన తండ్రి తన ఉద్యోగాన్ని వదిలేందుకు నిరాకరించడని తెలిపాడు.

Next Story

Most Viewed