హాస్పిటల్లో చేరాక హెల్త్ అప్ డేట్ ఇచ్చిన మయాంక్ అగర్వాల్

by Dishanational6 |
హాస్పిటల్లో చేరాక హెల్త్ అప్ డేట్ ఇచ్చిన మయాంక్ అగర్వాల్
X

దిశ, స్పోర్ట్స్: క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఫ్లైట్ లో విషపూరిత డ్రింక్ తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కాగా.. హాస్పిటల్ లో చేరాక మయాంక్ తొలిసారి సోషల్ మీడియా ద్వారా తన హెల్త్ అప్ డేట్ పంచుకున్నాడు. తను ఇప్పుడు బాగానే ఉన్నానని తెలిపాడు. తిరిగి క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని.. తనకోసం ప్రార్థనలు చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. అభిమానుల ప్రేమ, మద్దతుతో త్వరగానే కోలుకుంటున్నాని అన్నాడు.

ఈనెల 30న అగర్తలా నుంచి ఢిల్లీకి వెళ్లే విమానంలో విషపూరిత ద్రవాన్ని తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు మయాంక్. వెంటనే ఈ క్రికెటర్ ను అగర్తలోని హాస్పిటల్ లో చేర్చారు. అక్కడ ఐసీయూలో చికిత్స అందించారు. రంజీ ట్రోఫిలో కర్ణాటక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు మయాంక్. త్రిపురలో మ్యాచ్ జరిగిన తర్వాత విమానంలో ఢిల్లీకి బయల్దేరాడు. మెడికల్ ఎమర్జెన్సీతో ఢిల్లీ వెళ్లాల్సిన విమానం తిరిగి అగర్తలకు వచ్చింది. తర్వాత క్రికెటర్ ను హాస్పిటల్ లో చేర్చించారు. మయాంక్ కు ప్రమాదం తప్పిందని.. అతడిని త్రిపుర నుంచి బెంగళూరుకు తరిలించనున్నట్లు తెలిపారు కర్ణాటక రంజీ జట్టు మేనేజర్. కాగా..ఈ కర్ణాటక కెప్టెన్ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేస్తున్నారని తెలిపారు .

వాటర్ బాటిల్ అనుకుని.. హానికారక ద్రావణం తాగిన కేసులో ఏదో కుట్ర ఉందని భావిస్తుంది కర్ణాటక టీం. ఈ విషయంలో దర్యాప్తు కొనసాగుతోంది. మయాంక్ తరఫున కర్ణాటక జట్టు మేనేజర్ త్రిపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అగర్తలలోని న్యూ క్యాపిటల్ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

Read More..

టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

Next Story

Most Viewed