Aadhaar card: ఆధార్‌పై ఆ ఫేక్ ప్రచారం నమ్మకండి! ఆధార్‌ అప్‌డేట్‌‌పై UIDAI అలర్ట్!

by Ramesh N |
Aadhaar card: ఆధార్‌పై ఆ ఫేక్ ప్రచారం నమ్మకండి! ఆధార్‌ అప్‌డేట్‌‌పై UIDAI అలర్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆన్‌లైన్‌లో ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసేందుకు జూన్‌ 14 తేదీని చివరి తేదీగా యూఐడీఏఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే జూన్‌ 14 తర్వాత ఇప్పుడున్న పాత ఆధార్‌ కార్డు పనిచేయదని పుకార్లు వస్తున్నాయి. దీనిపై తాజాగా యూఐడీఏఐ స్పందించింది. జూన్ 14 తర్వాత పాత ఆధార్ కార్డులు పనిచేయవంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది.

గత పదేళ్లుగా ఆధార్ కార్డును ఎలాంటి అప్డేట్ చేసుకోని వారు జూన్ 14లోగా ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని సూచించింది. గడువు తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అప్డేట్ చేయని పాత ఆధార్ కార్డులు పని చేయకపోవడం అనేది ఉండదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

Next Story

Most Viewed