ఇజ్రాయెల్‌కు త్వరలో సర్‌ప్రైజ్: హిజ్బుల్లా గ్రూప్

by Harish |
ఇజ్రాయెల్‌కు త్వరలో సర్‌ప్రైజ్: హిజ్బుల్లా గ్రూప్
X

దిశ, నేషనల్ బ్యూరో: గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న ఇజ్రాయెల్-హామాస్ యుద్ధం ఇంకా కొలిక్కి రాలేదు. ఇలాంటి సమయంలో ఇరాన్ మద్దతుగల లెబనీస్ సంస్థ హిజ్బుల్లా గ్రూప్ ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి గ్రూప్ సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లా ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఇజ్రాయెల్‌ త్వరలో సర్‌ప్రైజ్‌కు సిద్ధంగా ఉండాలని అన్నారు, దీనర్థం హామాస్‌కు మద్దతుగా ఉన్న హిజ్బుల్లా గ్రూప్ ఆ దేశంపై దాడి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన కొన్ని రోజుల తర్వాత లెబనీస్ సంస్థ నుంచి ఈ హెచ్చరిక వచ్చింది.

వీడియోలో మాట్లాడిన హసన్ నస్రల్లా, పాలస్తీనా రాజ్యాన్ని అనేక యూరోపియన్ దేశాలు గుర్తించడం ద్వారా ఇజ్రాయెల్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని అన్నారు. ఆ దేశ నాయకులు గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌ ఏం సాధించలేదని స్వయంగా అంగీకరించారని, పేర్కొంటూ.. ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి అధిపతి త్జాచి హనెగ్బీ తాము ఎలాంటి వ్యూహాత్మక లక్ష్యాలను సాధించలేదని, దీనికి సంవత్సరాలు పట్టవచ్చని అంగీకరించడాన్ని నస్రల్లా ప్రముఖంగా ప్రస్తావించారు.

ఇజ్రాయెల్ తన సైనిక దాడిని తక్షణమే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఆదేశించినప్పటికీ, ఇజ్రాయెల్ అంతర్జాతీయ తీర్మానాలను గౌరవించడం లేదని, రఫాపై హింసాత్మక దాడులను ప్రారంభించిందని ఆయన ఆరోపించారు. లెబనాన్ అంతర్యుద్ధం సమయంలో బలమైన శక్తిగా ఉద్భవించిన హిజ్బుల్లా, పాలస్తీనా గాజాకు మద్దతుగా ఇజ్రాయెల్‌‌పై వరుసగా దాడులు చేస్తుంది.

Next Story

Most Viewed