మ‌రో భార‌త‌ క్రికెట‌ర్ తండ్రి మృతి..ఆల‌స్యంగా వెలుగులోకి !

by velandi.Saikiran |

భార‌త క్రికెట‌ర్ జితేష్ శ‌ర్మ తండ్రి మృతి చెందారు. అయితే ఈ విష‌యాన్ని చాలా ఆల‌స్యంగా తెలిపాడు జితేష్ శ‌ర్మ‌.

మ‌రో భార‌త‌ క్రికెట‌ర్ తండ్రి మృతి..ఆల‌స్యంగా వెలుగులోకి !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత జట్టులో మరో పెను విషాదం చోటు చేసుకుంది. వికెట్ కీపర్ జితేష్ శర్మ ( Jitesh Sharma ) తండ్రి మృతి చెందారు. ఫిబ్రవరి ఒకటో తేదీన తీవ్ర అనారోగ్యంతో జితేష్ శర్మ తండ్రి మోహన్ శర్మ మృతి చెందారు. అయితే ఈ సంఘటన గత నెలలో జరగగా, చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జితేష్ శర్మ అనామక ప్లేయర్ అయిన నేపథ్యంలో ఈ వార్త బయటకు రాలేదని తెలుస్తోంది. అయితే తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో తనకు స్థానం దక్కకపోవడంపై స్పందించిన జితేష్ శర్మ, తన తండ్రి మరణ వార్త గురించి పంచుకున్నాడు. ఈ సందర్భంగా కాస్త ఎమోషనల్ అయ్యాడు జితేష్ శర్మ.

టీ20 ప్రపంచ కప్ కోసం తనను ఎంపిక చేయకపోవడం మంచిదైందని, ఒకవేళ సెలెక్ట్ చేస్తే, తన తండ్రితో చివరి క్షణాలు గడపకుండా మిస్ అయ్యే వాడిని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ సెలెక్ట్ చేయకపోవడం వల్ల తన తండ్రి చివరి రోజుల్లో ఆయనతో గడిపే అవకాశం వచ్చిందని తెలిపారు జితేష్ శ‌ర్మ. వరల్డ్ కప్ కంటే, తనకు తండ్రి ఎక్కువ అంటూ పేర్కొన్నారు. ఆయ‌న‌ చివరి రోజుల్లో నా అవసరం కూడా తండ్రికి ఉంటుందని, భావోద్వేగానికి గురయ్యారు జితేష్ శర్మ. ఇక తన తండ్రి ఫిబ్రవరి ఒకటో తేదీన మరణించగా, ఆ తర్వాత కుటుంబ బాధ్యత మొత్తం పెద్ద కుమారుడిగా తన పైన పడిందని వ్యాఖ్యానించారు.

వరల్డ్ కప్ లో ఛాన్స్ రాకపోవడం పై క్లారిటీ

టీ20 వరల్డ్ కప్ కోసం తనను సెలెక్ట్ చేస్తారని ముందుగా భావించినట్లు తెలిపాడు జితేష్ శర్మ. కానీ చివరి క్షణంలో తనను తప్పించి ఇషాన్ కిషన్ కు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. దీంతో కాస్త బాధ పడినట్లు వెల్లడించాడు జితేష్ శర్మ. ఇక ఆ తర్వాత ప్రపంచ కప్ మ్యాచ్ లన్ని కూడా ఇంటి నుంచి టీవీలో మాత్రమే చూశానని చెప్పుకొచ్చాడు. కాగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సంద‌ర్భంగా ఇషాన్ కిష‌న్ అద్భుతంగా రాణించిన సంగ‌తి తెలిసిందే. క్లిక్

Next Story