- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా ఆటను పట్టించుకోలేదు.. కానీ, నన్ను : చేదు అనుభవాన్ని బయటపెట్టిన చెస్ క్రీడాకారిణి
భారత చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ తాజాగా నెదర్లాండ్స్‌లో జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీలో ప్రేక్షకుల నుంచి తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది.

దిశ, స్పోర్ట్స్ : భారత చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ తాజాగా నెదర్లాండ్స్‌లో జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీలో ప్రేక్షకుల నుంచి తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ప్రేక్షకులు తన ఆటపై కంటే, తన హెయిర్, దుస్తులు, మాట తీరుపైనే ఫోకస్ పెట్టారని తెలిపింది. తాజాగా ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఆమె సుదీర్ఘ పోస్టు పెట్టింది. ‘చెస్‌లో మహిళలను ప్రేక్షకులు ఎలా చూస్తారో నేను గమనించాను. ఈ టోర్నీలో నాకు జరిగిందే తాజా ఉదాహరణ. నా దుస్తులు, హెయిర్, మాట తీరు.. ఇలా నన్ను అన్ని రకాలుగా చూశారు. మహిళలు చెస్ ఆడేటప్పుడు వారి సామర్థ్యాలను పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం. మహిళలు ప్రతి రోజు ఇలాంటివే ఎదుర్కొంటారని నేను అనుకుంటున్నా. నాకు 18 సంవత్సరాలు. కొన్నేళ్లుగా నేను అనవసర విషయాల్లో ద్వేషానికి గురవుతున్నాను. పురుషులతో సమానంగా మహిళలకు గౌరవం దక్కాలి.’ అని దివ్య దేశ్‌ముఖ్ వాపోయింది. కాగా, నాగ్‌పూర్‌కు చెందిన దివ్య ఇటీవల ముగిసిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీలో 4.5 స్కోరుతో 12వ స్థానంలో నిలిచింది. గతేడాది ఏషియన్ ఉమెన్స్ చెస్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచింది.
- Tags
- #Divya Deshmukh






