- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన అర్జున్ ఎరిగైసీ
by Phanindra |
ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్‌కు భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసీ అర్హత సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

X
దిశ, స్పోర్ట్స్: భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసీ అరుదైన ఘనత సాధించాడు. త్వరలో సౌదీ అరేబియాలోని రియాద్ వేదికగా జరగనున్న ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ (ఈడబ్ల్యూసీ) 2025కు అర్హత సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత చెస్ ప్లేయర్‌గా అర్జున్ నిలిచాడు. మొత్తం 118 మంది పాల్గొన్న చెస్ డాట్ కామ్ క్లాసిక్ టోర్నీలో ప్లే-ఇన్ స్విస్ దశలో 7/9 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడీ చెస్ గ్రాండ్ మాస్టర్. చెస్ డాట్ కామ్ క్లాసిక్ ప్లేఆఫ్స్‌కు చేరడంతో అతను ఈడబ్ల్యూసీకి అర్హత సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Next Story






