- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెలరేగిన భారత బౌలర్లు.. 270 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య విశాఖ వేదికగా మూడో వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య విశాఖ వేదికగా మూడో వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచులో 20 ఏళ్ల తర్వాత టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ఒపెనర్ డికాక్ 106, కెప్టెన్ బావుమా 48 మినహా ఎవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లు ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ లో రెచ్చిపోవడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఈ మ్యాచులో అర్షదీప్ 1, జడేజా 1, కుల్దీప్ యాదవ్ 4, ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తీసుకున్నారు. దీంతో సౌతాఫ్రికా జట్టు 47.5 ఓవర్లకు 270 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. వన్డే సిరీస్ కు అత్యంత కీలకమైన ఈ మ్యాచులో భారత్ విజయం సాధించాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 271 పరుగులు చేయాల్సి ఉంది. మరి టీమిండియా సౌతాఫ్రికా బౌలర్లను ఎదుర్కొని మ్యాచ్ లో విజయం సాధిస్తారా లేదా తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు వేచి చూడాల్సిందే.
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(w), టెంబా బావుమా(సి), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రామ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, KL రాహుల్(w/c), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ






