తమీమ్ ఇండియన్ ఏజెంట్.. బుద్ది మాటలు చెప్పిన మాజీ కెప్టెన్‌పైనే బీసీబీ సంచలన ఆరోపణలు

by Harish |

తమీమ్ ఇండియన్ ఏజెంట్.. బుద్ది మాటలు చెప్పిన మాజీ కెప్టెన్‌పైనే బీసీబీ సంచలన ఆరోపణలు
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెలలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనడానికి తమ జట్టును భారత్‌కు పంపమని, తమ మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ఇటీవల ఐసీసీని అభ్యర్థించింది. ఇందుకు ఆటగాళ్ల భద్రతను సాకుగా చూపింది. బీసీబీ నిర్ణయంపై బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. బంగ్లా క్రికెట్ భవిష్యత్తును ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందంటూ హితువు పలికాడు. ‘చాలా సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. నేనైతే వరల్డ్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ స్థానం, దేశ క్రికెట్, క్రికెటర్ల‌కు ఏదో మంచిదో ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడిని. ఇప్పుడు తీసుకునే నిర్ణయం 10 ఏళ్ల తర్వాత ప్రభావం చూపుతుంది. ఐసీసీ నుంచే మనకు 90-95 శాతం ఆదాయం వస్తుంది. కాబట్టి అన్నీ విషయాలు ఆలోచించాలి’అని తమీమ్ సూచించాడు.

అలాగే, బంగ్లా క్రికెట్‌లో ప్రభుత్వ జోక్యంపై మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వతంత్ర సంస్థ అని, సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం బోర్డుకు ఉండాలన్నాడు. తమీమ్‌ సూచనలను బీసీబీ లెక్కచేయకపోగా.. అతనో ఇండియన్ ఏజెంట్ అని బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ ఎం. నజ్ముల్ ఇస్లామ్ ఆరోపించాడు. ‘బంగ్లా ప్రజలు మరోసారి భారత ఏజెంట్‌ను తమ కళ్లతో చూశారు.’అన ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. కాసేపటికే పోస్టు తొలగించగా అప్పటికే అది వైరల్‌గా మారింది.


Next Story