చెలరేగిన రోహిత్, కోహ్లీ.. సిడ్నీ వన్డేలో భారత్ ఘన విజయం

by Gantepaka Srikanth |

సిడ్నీ మైదానం వేదికగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా(India) ఘన విజయం సాధించింది.

చెలరేగిన రోహిత్, కోహ్లీ.. సిడ్నీ వన్డేలో భారత్ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: సిడ్నీ మైదానం వేదికగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా(India) ఘన విజయం సాధించింది. చివరి వన్డేలో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ(121), విరాట్ కోహ్లీ(74) సత్తా చాటారు. ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీకి పైగా పరుగులు చేయడం ఫ్యాన్స్‌కు ఆనందాన్ని ఇచ్చింది. రెండో వన్డేలో హాఫ్ సెంచరీకి పైగా పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌‌లో సెంచరీతో అదరగొట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది.

భారత బౌలర్ల దెబ్బకు 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4, సుందర్ 2, సిరాజ్, కుల్‌దీప్‌, అక్షర్, ప్రసిద్ధ్‌కృష్ణ తలో వికెట్ తీశారు. అనంతరం 237 పరుగుల లక్ష్యంతో భారత్‌ బరిలో వచ్చింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(24) మళ్లీ నిరాశ పరిచారు. సీనియర్లు అయిన రోహిత్, కోహ్లీ ఇద్దరూ రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. ఆసీస్ బౌలర్లలో జాష్ హెజుల్‌వుడ్ ఒక్కడే ఒక వికెట్ తీశారు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి ఆసీస్ సిరీస్ కైవసం చేసుకుంది.

Next Story