- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సీరిస్ కైవసం
by Gantepaka Srikanth |
శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సీరిస్ కైవసం

X
దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని తిరువనంతపురం(Thiruvananthapuram) వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 112 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించి ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు టీ20ల సీరిస్‌లో ఇప్పటికే 03 మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. దీంతో సీరిస్ భారత్ ఖాతాలో పడిపోయింది. టాస్ ఓడి ముందుగా శ్రీలంక బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఇమేషా దులానీ (27), హాసిని పెరీరా (25), కవీషా దిల్హారి (20) పరుగులు చేశారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4, దీప్తి శర్మ 3 వికెట్లు తీశారు. భారత బ్యాటర్లలో షెపాలీ 79 పరుగులతో మళ్లీ చెలరేగింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చివర వరకు నిల్చోని జట్టుకు విజయాన్ని అందించారు.
Next Story






