రెండో టీ20లో భారత్ ఓటమి.. టీ20 సిరీస్ సమం

by Harish |

రెండో టీ20లో భారత్ ఓటమి.. టీ20 సిరీస్ సమం
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా‌తో తొలి టీ20లో నెగ్గిన భారత మహిళల క్రికెట్ జట్టు రెండో టీ20లో ఆ జోరును కొనసాగించలేకపోయింది. కాన్‌బెర్రాలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసిస్ 20 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 163 రన్స్ చేసింది. ఆ జట్టులో ఓపెనర్ జార్జియా వాల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. 57 బంతుల్లో 88 పరుగులు చేసి సత్తాచాటింది. మరో ఓెనర్ బెత్ మూనీ(46) కూడా రాణించింది. తొలి వికెట్‌‌కు వీరిద్దరూ ఏకంగా 128 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరిని తెలుగమ్మాయి అరుంధతి రెడ్డినే అవుట్ చేసింది. ఆ తర్వాత లిచ్‌ఫీల్డ్(6), ఎల్లీస్ పెర్రీ(7), జార్జియా వారేహమ్(0) విఫలమైనప్పటికీ ఆసిస్ చివరికి 163 రన్స్ చేసింది. ఇక చేజింగ్ భారత అమ్మాయిల జట్టు అంచనాలను అందుకోలేకపోయింది. 20 ఓవర్లలో 144/9 స్కోరుకే పరిమితమై ఓటమి చవిచూసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్(36), స్మృతి మంధాన(31), షఫాలీ వర్మ(29) పర్వాలేదనిపించగా.. మిగతా వారు నిరాశపర్చడంతో ఓటమి తప్పలేదు. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. ఇక సిరీస్ ఫలితం మూడో టీ20లో తేలనుంది. శనివారం ఆఖరి మ్యాచ్ జరగనుంది.


Next Story