190 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత మహిళల జట్టు భారీ విజయం

by Harish |

తొలి వన్డే‌లో పరాజయానికి ఆస్ట్రేలియాపై భారత మహిళల క్రికెట్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది.

190 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత మహిళల జట్టు భారీ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : తొలి వన్డే‌లో పరాజయానికి ఆస్ట్రేలియాపై భారత మహిళల క్రికెట్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. రెండో వన్డేలో ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించింది. న్యూచండీగఢ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 102 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ముందుగా భారత జట్టు 49.5 ఓవర్లలో 292 పరుగులు చేసి ఆలౌటైంది. స్మృతి మంధాన(117) సెంచరీతో రెచ్చిపోయింది. ఆమెకుతోడు దీప్తి శర్మ(40) విలువైన ఇన్నింగ్స్ ఆడింది. అనంతరం భారత బౌలర్లు కూడా తమ పాత్ర నిర్వర్తించారు. ఆస్ట్రేలియాను 40.5 ఓవర్లలోనే 190 పరుగులకే కుప్పకూల్చారు. ఆసిస్ జట్టులో సుదర్లాండ్(45), ఎల్లీస్ పెర్రీ(44) పర్వాలేదనిపించగా.. మిగతా వారు క్రీజులో కూడా నిలువలేకపోయారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 3 వికెట్లు, దీప్తి శర్మ 2 వికెట్లతో సత్తాచాటి ఆసిస్ పతనంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-1 సమం చేసింది. శనివారం జరిగే మూడో వన్డే జరగనుంది.


Next Story