సెమీస్‌లో ఆస్ట్రేలియా చిత్తు.. మహిళల వరల్డ్ కప్‌ ఫైనల్‌కు భారత్

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-30 18:21:34  IST  )

ముంబై మైదానం(Mumbai Ground) వేదికగా వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత(India) మహిళల జట్టు అదరగొట్టింది.

సెమీస్‌లో ఆస్ట్రేలియా చిత్తు.. మహిళల వరల్డ్ కప్‌ ఫైనల్‌కు భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై మైదానం(Mumbai Ground) వేదికగా వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన సెకండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత(India) మహిళల జట్టు అదరగొట్టింది. ఆసిస్ నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. 48.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసింది. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో జెమియా రోడ్రిగ్స్(127) సెంచరీతో రఫ్పాడించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(89) సైతం అద్భుతంగా రాణించి సెంచరీ మిస్ చేసుకుంది. మిగతా బ్యాటర్లు కూడా గౌరవప్రదమైన స్కోరు చేసి పరవాలేదనిపించారు. జట్టు సభ్యులు సమిష్టిగా రాణించి విజయం సాధించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో గార్త్, అన్నాబెల్ చెరో రెండేసి వికెట్లు తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ లీచ్ ఫీల్డ్ (119) దూకుడుగా ఆడి సెంచరీ బాదారు. ఎలీస్ పెర్రీ (77) అర్ధ శతకంతో రాణించగా.. ఆష్లీన్ గార్డ్‌నర్ (63) చివర్లో మెరుపులు మెరిపించింది. బెత్ మూనీ (24), కిమ్ గార్త్ (17), తాహిలా మెక్‌గ్రాత్ (12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీచరణి 2, దీప్తి శర్మ 2, క్రాంతి గౌడ్, అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

Next Story