విశాఖ వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

by Gantepaka Srikanth |

విశాఖ వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

విశాఖ వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ(Visakhapatnam) వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై 9 తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. సఫారీలు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని కేవలం 47.3 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో జైస్వాల్ సెంచరీ(106), రోహిత్ శర్మ(75), విరాట్ కోహ్లీ(65)లు హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ ఒక్కడే ఒక వికెట్ తీశారు. మూడు వన్డేల సిరీస్‌లో రెండు భారత్ విజయం సాధించడంతో సిరీస్ లభించింది. టాస్ ఓడిన సఫారీలు తొలుత బ్యాటింగ్ చేశారు. 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (106) సెంచరీ బాదాడు. టెంబా బావుమా (48) రాణించాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, ప్రసిద్ధ్‌ కృష్ణ 4, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

Next Story