- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల U19 వరల్డ్ కప్ విజేతగా భారత్
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకున్నది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగులు టార్గెట్‌ను కేవలం 12 ఓవర్లలోనే ఛేదించి విశ్వ విజేతగా నిలిచింది.

దిశ, వెబ్‌డెస్క్: మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకున్నది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల టార్గెట్‌ను ఒక వికెట్ కోల్పోయి కేవలం 11.2 ఓవర్లలోనే ఛేదించి విశ్వ విజేతగా నిలిచింది. మరోసారి తెలంగాణలోని భద్రాచలానికి చెందిన గొంగిడి త్రిష రాణించింది. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటిన ఆమె.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫైనల్‌లో మరో బ్యాటర్ సానిక చల్కే కూడా రాణించారు.
కాగా, తుదిపోరులో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో వాన్ వూరస్ట్ (23) టాప్ స్కోరర్‌గా నిలిచారు. మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేశారు. భారత బౌలర్లలో గొంగడి త్రిష 3, వైష్టవి శర్మ 2, ఆయుషి శుక్లా 2, పరుణిక 2, షబ్నమ్ ఒక వికెట్ తీశారు. 83 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి విశ్వవిజేతగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో త్రిష 44 పరుగుల చేయగా, సానిక 26 పరుగలు చేసింది. మరో బ్యాటర్ కమలిని ఎనిమిది పరుగులే చేసి ఔటయ్యింది. ఇదిలా ఉండగా.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ మరోసారి కప్ సాధించడం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.






