- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: అహ్మదాబాద్ టీ20లో భారత్ ఘన విజయం.. 3-1తో సిరీస్ కైవసం
అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది. సూర్యసేన.. సౌతాఫ్రికాపై 30 పరుగుల తేడాతో గెలిచింది. 5 వికెట్ల నష్టానికి భారత్ 231 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి ఓటమి పాలయ్యింది. ఐదు టీ 20ల సిరీస్ లో పొగమంచు కారణంగా 4వ టీ20 మ్యాచ్ రద్దవ్వగా.. భారత్ 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
శుక్రవారం జరిగిన మ్యాచ్ లో తొలుత భారత్ 231 రన్స్ చేయగా.. సౌతాఫ్రికా 201 పరుగులు చేసింది. భారత జట్టులో తిలక్ వర్మ (73), హార్దిక్ (63) పరుగులతో రాణించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో డికాక్ (65), బ్రెవిస్ (31) పరుగుు చేశారు. తొలి 10 ఓవర్లలోనే సౌతాఫ్రికా 118 రన్స్ చేసింది. కానీ తర్వాతి 10 ఓవర్లలో బ్యాటర్లు తడబడటంతో ఓటమిని చవిచూసింది. భారత్ బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు, బుమ్రాకు 2, అర్షదీప్, పాండ్యా చెరో వికెట్ తీశారు. సిరీస్ కైవసం చేసుకున్న సూర్యసేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.






