- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND VS AUS : సెమీస్‌లో గెలిచేది ఆ జట్టే.. జోస్యం చెప్పిన సునీల్ గవాస్కర్
చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియాకు ఎదురులేకుండా పోయింది.

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియాకు ఎదురులేకుండా పోయింది. వరుసగా మూడు విజయాలతో గ్రూపు దశను అజేయంగా ముగించింది. మంగళవారం జరగబోయే సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో టీమ్ ఇండియానే విజయం సాధిస్తుందని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో గవాస్కర్ మాట్లాడుతూ.. టీమిండియా స్పష్టమైన ఫేవరెట్ అని చెప్పాడు.
దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామమని నిరూపితమైందని, ఆసిస్‌పై భారత్‌కు అది సానుకూలంశమని తెలిపాడు. పాట్ కమిన్స్, జోష్ హాజెల్‌వుడ్, మిచెల్ స్టార్క్ వంటి కీలక ప్లేయర్లను ఆసిస్ కోల్పోయిందని, అలాగే, ఆ జట్టు స్పిన్ ఎటాక్ కూడా గొప్పగా లేదని వివరించాడు. అయితే, కంగారుల బ్యాటింగ్ బాగుందని, దూకుడుగా ఆడుతున్నారని చెప్పాడు. సెమీస్‌లో ఆసిస్ చేయడం కంటే భారత్ చేజింగ్ చేయడం బాగుంటుందన్నాడు.
వన్డేల్లో ఇప్పటివరకు ఇరు జట్లు 151 వన్డేల్లో తలపడ్డాయి. ఆసిస్ 84 విజయాలతో ఆధిపత్య స్థితిలో ఉన్నది. భారత్ 57 మ్యాచ్‌ల్లో నెగ్గింది. 10 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. చివరిసారిగా భారత్, ఆసిస్ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆడాయి. అప్పుడు టీమిండియాను ఓడించిన ఆసిస్ టైటిల్ ఎగరేసుకపోయింది. ఆ ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తున్నది.






