IND VS SL: ఆసియా క‌ప్ ఫైన‌ల్ కంటే ముందే టీమిండియా బంప‌ర్ ఆఫ‌ర్‌

by velandi.Saikiran |

ఆసియా కప్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన శ్రీలంక జట్టుతో... టీమిండియా తలపడనుంది. ఇవాళ రాత్రి 8 గంటల

IND VS SL: ఆసియా క‌ప్ ఫైన‌ల్ కంటే ముందే టీమిండియా బంప‌ర్ ఆఫ‌ర్‌
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ చివరి దశకు వచ్చింది. కేవలం ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ కు పాకిస్తాన్ అలాగే టీమిండియా చేరుకున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం రోజున ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు... ఓ నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది టీం ఇండియా.

ఇప్పటికే ఆసియా కప్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన శ్రీలంక జట్టుతో... టీమిండియా తలపడనుంది. ఇవాళ రాత్రి 8 గంటల సమయంలో దుబాయ్ ఇంటర్నేషనల్ మైదానంలో టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య ఫైట్ జరగనుంది. ఇందులో ఏ జట్టు గెలిచినా పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పులు ఉండవు.

అయితే టీమిండియా కు మాత్రం మంచి అడ్వాంటేజ్ కానుంది. ఫైనల్ కంటే ముందు శ్రీలంకతో మ్యాచ్ ఆడటం.... టీమిండియా కు చాలా లాభం జరుగుతుంది. ఇవాళ్టి శ్రీలంక మ్యాచ్ ను ప్రాక్టీస్ భావించి... టీమిండియా ఆడాలి. అలా చేస్తే... పాకిస్థాన్ పై దాటిగా ఆడ‌వచ్చును. పాక్ కంటే శ్రీలంక చాలా బ‌ల‌మైన జ‌ట్టు. ఇలాంటి త‌రుణంలో... శ్రీలంకతో జ‌రిగే మ్యాచ్ ను బాగా వినియోగించుకోవాలి టీమిండియా. ఆ దిశ‌గా సూర్య భాయ్ అడుగులు వేస్తున్నారు.

Next Story