- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hockey Asia Cup : భారత్, సౌత్ కొరియా మ్యాచ్ డ్రా
హాకీ ఆసియా కప్‌లో భారత్ జోరుకు చిన్న బ్రేక్ పడింది.

దిశ, స్పోర్ట్స్ : హాకీ ఆసియా కప్‌లో భారత్ జోరుకు చిన్న బ్రేక్ పడింది. బుధవారం జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో సౌత్ కొరియా చేతిలో తృటిలో ఓటమి నుంచి బయటపడింది. డిఫెండింగ్ చాంపియన్‌తో 2-2తో భారత్ డ్రా చేసుకుంది. గ్రూపు దశలో భారత జట్టు మూడు విజయాలతో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. బలమైన సౌత్ కొరియా జట్టుతో పోరు అంత సులభంగా ఉండదని భారత్‌కు తెలుసు. అనుకున్నట్టే తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే, మ్యాచ్‌లో భారత్‌దే ఆరంభం. 8వ నిమిషంలో హార్దిక్ గోల్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. కానీ, ఆ తర్వాత సౌత్ కొరియా దూకుడు పెంచింది. యాంగ్ వరుగా 12వ నిమిషంలో, 14వ నిమిషంలో రెండు గోల్స్ చేశాడు. దీంతో ప్రత్యర్థి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అలాగే, అద్భుతమైన డిఫెన్స్‌తో చాలా సేపు భారత్‌ను నిలువరించింది. టీమిండియాకు ఓటమి తప్పదేమో అనిపించింది. మరో 7 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా మన్‌దీప్ జట్టును ఆదుకున్నాడు. 53వ నిమిషంలో గోల్ చేసి స్కోర్‌ను 2-2తో సమం చేశాడు. ఇక, మిగతా సమయంలో ఏ జట్టు గోల్ చేయకపోవడంతో మ్యాచ్ డ్రా అయ్యింది. నేడు రెండో సూపర్ 4 మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడనుంది. ఫైనల్ ఆశలు సంక్లిష్టం కాకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ నెగ్గాల్సిందే.






