- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి రెండో టెస్ట్.. ఆ ప్లేయర్ లేకుండానే బరిలోకి టీమిండియా
ఇవాళ భారత కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరించబోతున్నాడు. అయితే గిల్ స్థానంలో సాయి సుదర్శన్ ఆడబోతున్నట్లు

దిశ, వెబ్ డెస్క్: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నేటి నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ పూర్తి కాగా, అందులో భారత్ దారుణంగా ఓడిపోయింది. ఇలాంటి నేపథ్యంలో రెండవ పోరుకు సిద్ధమైంది భారత్. గువాహటి వేదికగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ లో గాయపడిన గిల్, రెండు టెస్టుకు దూరం కానున్నాడు. దీంతో ఇవాళ భారత కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరించబోతున్నాడు. అయితే గిల్ స్థానంలో సాయి సుదర్శన్ ఆడబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి కూడా ఇవాళ తుది జట్టులో ఛాన్స్ వస్తుందని అంటున్నారు. ఇక ఈ రెండో టెస్టులో భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఒకవేళ డ్రా అయినా కూడా దక్షిణాఫ్రికానే 1-0 తేడాతో ఈ సిరీస్ గెలిచే ప్రమాదం ఉంది. ఇలాంటి తరుణంలో భారత్ ఆచితూచి ఆడాల్సి ఉంటుంది.






