చిత్తుగా ఓడిన భారత్.. 124 పరుగులు ఛేదించలేకపోయిన బ్యాటర్లు

by Malleboina Mahesh |   (  Updated:2025-11-16 09:27:00  IST  )

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత జట్టు చిత్తుగా ఓడిపోయింది. కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని చేదించక ముందు ఆలౌట్ అయింది.

చిత్తుగా ఓడిన భారత్.. 124 పరుగులు ఛేదించలేకపోయిన బ్యాటర్లు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత జట్టు చిత్తుగా ఓడిపోయింది. కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని చేదించక ముందు ఆలౌట్ అయింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. RSA మొదటి ఇన్నింగ్స్ లో 159, రెండో ఇన్నింగ్స్ లో 153 పరుగులతో ఆలౌట్ అయింది. అయితే భారత జట్టు 124 పరుగుల లక్ష్యంతో చేజింగ్ దిగగా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 93 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా జట్టు 30 పరుగుల తేడాతో విజయం సాధించి టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి చేరింది.

రెచ్చిపోయిన బౌలర్లు..

కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మొదటి టెస్టులో ఇరు జట్ల బౌలర్లు రెచ్చిపోయారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు బూమ్రా 5, సిరజ్ 2, కుల్దీప్ 2, అక్షర్ ఒక వికెట్ తీసుకున్నారు. అలాగే భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకు ఆలౌట్ కాగా.. Simon Harmer 4, మార్కో జెన్ సన్ 2, కేషవ్ మహరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. దీంతో భారత జట్టు మొదటి టెస్టులో 124 పరుగుల లక్ష్యాన్ని చేదించలేక 30 పరుగులు తేడాతో ఓటమిపాలైంది.

Next Story