- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్.. క్రికెటర్ల షేక్ హ్యాండ్‌పై క్లారిటీ
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రీడాకారులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరుగబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్(ICC Men's T20 World Cup 2026)లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ కోసం క్రీడాకారులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరుగబోతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచకప్ టోర్నమెంట్లలో భారత్‌పై మేము మెరుగైన ప్రదర్శన చేయక చాలా ఏళ్లు అయింది. భారత్‌పై మంచి రికార్డు లేదు. గత చరిత్రను మేం మార్చలేం. అయితే, ఈసారి తప్పకుండా మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. అందరం మంచి ఫామ్‌లో ఉన్నాం.. తప్పకుండా రాణిస్తామనే నమ్మకం కూడా ఉంది. భారత్‌లో మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎక్కువగా మార్పులు చేయబోమని స్పష్టం చేశారు. మరోవైపు భారత ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంపై ఇప్పుడే చెప్పలేమని అన్నారు. భారత క్రీడాకారులు మాకు షేక్ హ్యాండ్ ఇస్తే మేమూ తప్పకుండా ఇస్తాం. టీమ్‌ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకుని మ్యాచ్‌లో ఆడతాడని ఆశిస్తున్నాం. అత్యుత్తమ ఆటగాళ్లు ఉండాలని మేమూ కోరుకుంటాం అని సల్మాన్ వెల్లడించాడు.






