రెచ్చిపోతున్న భారత బౌలర్లు.. పీకల్లోతు కష్టాల్లో పాక్

by Harish |

రెచ్చిపోతున్న భారత బౌలర్లు.. పీకల్లోతు కష్టాల్లో పాక్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. కొలంబోలో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సూర్య సేన 176 పరుగుల టార్గెట్ పెట్టింది. ఇక, ఛేదనలో పాక్ బ్యాటర్లు భారత బౌలింగ్‌ ముందు నిలవలేకపోతున్నారు. పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయింది ఆ జట్టు. తొలి ఓవర్‌లోనే పాండ్యా.. ఓపెనర్ ఫర్హాన్(0) డకౌట్ చేసి పాక్‌ను గట్టి దెబ్బకొట్టాడు. ఆ షాక్ నుంచి కోలుకోకముందే ప్రత్యర్థిని బుమ్రా కోలుకోకుండా చేశాడు. రెండు వికెట్లతో విజృంభించాడు. వరుసగా సైమ్ అయూబ్(6), కెప్టెన్ సల్మాన్(4)లను పెవిలియన్ పంపాడు. కాసేపటికే బాబర్ ఆజామ్(5)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో పాక్ 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత బౌలర్ల జోరు చూస్తుంటే పాక్‌ను 100లోపే ఆలౌట్ చేసేలా ఉన్నారు. పవర్ ప్లేలో పాక్ 38/4 స్కోరు చేసింది. ఆ జట్టు ఇంకా 84 బంతుల్లో 138 రన్స్ చేయాలి.

Next Story