India vs Pakistan: నెమ్మదించిన భారత స్కోరు బోర్డు.. నాలుగో వికెట్ డౌన్

by Ramesh Naini |   (  Updated:2026-02-15 15:18:28  IST  )

భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఉత్కంఠ పోరులో టీ మిండియా ఇన్నింగ్స్ ఒక్కసారిగా నెమ్మదించింది.

India vs Pakistan: నెమ్మదించిన భారత స్కోరు బోర్డు.. నాలుగో వికెట్ డౌన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఉత్కంఠ పోరులో టీ మిండియా ఇన్నింగ్స్ ఒక్కసారిగా నెమ్మదించింది. ధాటిగా ఆడుతున్న క్రమంలో వరుస వికెట్లను కోల్పోవడంతో భారత స్కోరు వేగం తగ్గింది. పాక్ బౌలర్ సాయిమ్ అయూబ్ తన స్పిన్ మాయాజాలంతో భారత బ్యాటర్లను కట్టడి చేశాడు.

డకౌట్‌గా వెనుతిరిగిన హార్దిక్ పాండ్యా..

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (0) తీవ్రంగా నిరాశపరిచాడు. సాయిమ్ అయూబ్ వేసిన బౌలింగ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి బాబర్ ఆజమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 126 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది.

వరుసగా మూడు వికెట్లు తీసిన అయూబ్

భారత్ ఒకానొక దశలో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపించినా, సాయిమ్ అయూబ్ పాకిస్థాన్‌ను తిరిగి రేసులోకి తెచ్చాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ (77)ను 8.4 ఓవర్లో బౌల్డ్ చేసి బ్రేక్ ఇచ్చాడు. క్రీజులో కుదురుకుంటున్న తిలక్ వర్మ(25)ను ఎల్బీడబ్ల్యూ (LBW)గా వెనక్కి పంపాడు. హార్దిక్ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబెపై కూడా అయూబ్ అప్పీల్ చేశాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో పాక్ రివ్యూ తీసుకుంది. అయితే అల్ట్రాఎడ్జ్‌లో ఏమీ లేకపోవడంతో దూబె ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. క్రీజులో శివమ్ దూబె ఉన్నాడు. భారత బ్యాటర్లు మళ్లీ ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 17 ఓవర్లకు 140/4 గా స్కోర్ బోర్డు ఉంది.

Next Story