India vs Pakistan : చెలరేగిన ఊతప్ప.. భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు

by Harish |

కొంతకాలంగా టోర్నీతో, ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పాకిస్తాన్‌పై టీమిండియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.

India vs Pakistan : చెలరేగిన ఊతప్ప.. భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు
X

దిశ, స్పోర్ట్స్ : కొంతకాలంగా టోర్నీతో, ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పాకిస్తాన్‌పై టీమిండియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తాజాగా హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను భారత్ చిత్తు చేసింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఫలితాన్ని డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిలో తేల్చగా టీమిండియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 6 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఓపెనర్లు ఊతప్ప, భరత్ చిప్లి చెలరేగిపోయారు. ఊతప్ప 11 బంతుల్లో 28 రన్స్ చేయగా.. భరత్ 13 బంతుల్లో 24 పరుగులు రాబట్టాడు. అనంతరం కెప్టెన్ దినేశ్ కార్తీక్ కూడా 6 బంతుల్లో 17 రన్స్ చేశాడు. ఇక, పాక్ ఛేదనకు దిగగా మూడు ఓవర్ల తర్వాత వర్షం అంతరాయం కలిగించింది. ఆ సమయానికి ఆ జట్టు ఒక్క వికెట్ కోల్పోయి 41 రన్స్ చేసింది. ఆట సాగే అవకాశాలు లేకపోవడంతో డీఎల్‌ఎస్ పద్ధతిలో భారత్ గెలుపొందింది.


Next Story