- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND VS PAK: పాకిస్థాన్ కు కొత్త గండం..చిత్తు చిత్తుగా ఓడిపోవడమే ఇక !
ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఈ రెండు జట్లు ఇవాళ తలబడబోతున్నాయి. రాత్రి 8 గంటల సమయంలో ఈ బీకర ఫైట్ ప్రారంభమవుతుంది

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇవాళ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఈ రెండు జట్లు ఇవాళ తలబడబోతున్నాయి. రాత్రి 8 గంటల సమయంలో ఈ బీకర ఫైట్ ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో.... ఒకవైపు బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంటే... మరోవైపు పాకిస్తాన్ ను గత రికార్డులు వణికిస్తున్నాయి.
ఆ రికార్డులు ఇప్పుడు పాకిస్తాన్ జట్టుకు గండంగా మారాయి. ఐసీసీ ఈవెంట్ లలో ఈ రెండు జట్ల మధ్య ఫైట్ జరిగితే... ప్రతిసారి టీమిండియా నే పై చేయి సాధించింది. వన్డే వరల్డ్ కప్ లో రెండు జట్ల మధ్య ఎనిమిది సార్లు ఫైట్ జరిగితే... అన్ని మ్యాచ్ లు కూడా టీం ఇండియా గెలిచింది. టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో 8 మ్యాచులు జరిగితే.... ఏడింటిలో టీమ్ ఇండియా గెలవగా... ఒకే ఒక్క మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించింది.
ఛాంపియన్ ట్రోఫీలో... రెండు జట్ల మధ్య ఆరు మ్యాచ్లు నిర్వహించారు. ఇందులో రెండు జట్లు కూడా ఈక్వల్ గా గెలిచాయి. అయితే ఆసియా కప్ విషయానికి వస్తే.. రెండు జట్ల మధ్య పదహారు మ్యాచులు జరిగాయి. ఇందులో పాకిస్థాన్ 6 మ్యాచ్ లలో విజయం సాధించగా... 10 మ్యాచ్ లలో టీమిండియానే విజయం సాధించింది. దీంతో ఇవాళ్టి మ్యాచ్ లోనూ టీమిండియానే గెలుస్తుందని అంటున్నారు.






