CAVA Nations League : సెంట్రల్ ఏషియన్ వాలీబాల్ లీగ్... పాక్ పై భారత్

by Muthe.Rajitha |

ఏషియన్ వాలీబాల్ లీగ్ (CAVA Nations League) 2025 ఉజ్బెకిస్థాన్‌ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

CAVA Nations League : సెంట్రల్ ఏషియన్ వాలీబాల్ లీగ్... పాక్ పై భారత్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏషియన్ వాలీబాల్ లీగ్ (CAVA Nations League) 2025 ఉజ్బెకిస్థాన్‌ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత పురుషుల జట్టు, పాకిస్థాన్‌(Bharat vs Pakistan)ను అద్భుతంగా ఓడించింది. ఈ మ్యాచ్ నేటి సాయంత్రం 5:30 గంటలకు జరిగింది. భారత్ స్ట్రెయిట్ సెట్లలో 25-19, 25-19, 25-23 స్కోర్‌తో 1 గంట 30 నిమిషాల్లో విజయం సాధించింది. భారత జట్టు మొదటి రెండు సెట్లలో ఆధిపత్యం చెలాయించగా, మూడో సెట్‌లో పాకిస్థాన్ పుంజుకుని రెండు పాయింట్ల వ్యవధితో సమీపించినప్పటికీ.. జాన్ జోసెఫ్, ఈంతుంగల్ జోసెఫ్ నెట్ వద్ద అద్భుతమైన బ్లాక్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ టోర్నమెంట్‌లో ఏడు మ్యాచ్‌ల తర్వాత భారత్ మూడు విజయాలు, ఒక ఓటమి, మూడు డ్రాలతో రెండో స్థానంలో ఉంది.

టోర్నమెంట్ మొదట పాకిస్థాన్‌లో జరగాల్సి ఉండగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా భారత్ బయకాట్ చేయడంతో వేదిక ఉజ్బెకిస్థాన్‌కు మార్చబడింది. భారత ఆటగాళ్లలో చిరాగ్, అశ్వల్ రాయ్, ముత్తుస్వామి, జెరోమ్ విన్సెంట్, జాన్ జోసెఫ్ కీలక పాత్ర పోషించారు. మ్యాచ్‌లో చిరాగ్ డ్రాప్ షాట్లు, అశ్వల్ బ్లాక్‌లు, ముత్తుస్వామి డమ్మీ సెట్‌లు పాకిస్థాన్‌ను కట్టడి చేశాయి, ఈ విజయం భారత్-పాకిస్థాన్ వాలీబాల్ పోటీలో భారత్‌కు ముఖ్యమైన ఘట్టం, ఈ మ్యాచ్ CAVA మీడియా యూట్యూబ్ ఛానల్‌లో లైవ్ స్ట్రీమ్ అయింది, ఈ టోర్నమెంట్‌లో ఉజ్బెకిస్థాన్, ఇరాన్, కజకిస్థాన్, కిర్గిజ్స్థాన్, తుర్క్‌మెనిస్థాన్‌తో సహా ఏడు జట్లు పోటీ పడుతున్నాయి, భారత్ తదుపరి మ్యాచ్‌లో జూన్ 3న కజకిస్థాన్‌తో తలపడనుంది.

Next Story