- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ind vs Pak: పాకిస్తాన్ తో మ్యాచ్... టికెట్లు కొనే నాథుడే లేడా!
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ను వీక్షించేందుకు అభిమానులు

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ను వీక్షించేందుకు అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించేలా కనిపించడం లేదు. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ అంటే... ఒక ఊపు ఉంటుంది. ఒక్క టికెట్ మిగలకుండా అన్ని హాట్ కేకుల్లాగా అమ్ముడు అవుతాయి. కానీ ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఈ రెండు జట్ల మధ్య సెప్టెంబర్ 14వ తేదీన మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ సగం టికెట్లు మాత్రమే విక్రయించబడ్డాయట. ఇంకా సగం టికెట్లు సేల్ కాలేదని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ మూడు రోజుల్లో ఎన్ని మరికొన్ని సేల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.
అటు టీవీల్లో చూసే అభిమానులు కూడా... తగ్గే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి కారణం రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ జట్టులో ఉండకపోవడమే అని అంటున్నారు. జూనియర్ టీమ్ ఇండియా రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి నెలపొందని చెబుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య... యుద్ధ వాతావరణం జరిగిన నేపథ్యంలో... ఈ ఆదివారం జరిగే మ్యాచ్ ను చూడకూడదని నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేస్తున్నారు.






