- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరికాసేపట్లోనే మ్యాచ్..సూర్య బిగ్ స్కెచ్...50 పరుగులకే పాక్ ఆలౌట్ !
ఆసియా కప్ 2025 సూపర్ 4 లో భాగంగా ఇవాళ మరో బిగ్ జరుగనుంది. దుబాయ్ వేదికగా ఇవాళ సాయంత్రం పాకిస్థాన్ వర్సెస్

దిశ, వెబ్ డెస్క్ :ఆసియా కప్ 2025 సూపర్ 4 లో భాగంగా ఇవాళ మరో బిగ్ జరుగనుంది. దుబాయ్ వేదికగా ఇవాళ సాయంత్రం పాకిస్థాన్ వర్సెస్ టీమిండియా మధ్య జరుగనుంది. రాత్రి 8 గంటల నుంచే ఈ మ్యాచ్ ప్రసారాలు భారత కాలమానం ప్రకారం వస్తాయి. అయితే...గ్రూప్ స్టేజ్ లో దారుణంగా ఓడిపోయిన పాకిస్థాన్... సూపర్ 4 లో మాత్రం గెలవాలని ప్లాన్ చేస్తోంది. షేక్ హ్యాండ్ వివాదం పక్కకు పెట్టి..టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవాలని స్కెచ్ లు వేస్తున్నారు.
అయితే.. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదని సూర్య కుమార్ యాదవ్ సేన రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే... హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్ ను తొలగించి... బుమ్రా, వరుణ్ చక్రవర్తిని బరిలోకి దించేందుకు సూర్య ప్లాన్ చేస్తున్నారట. వాళ్లిందరినీ వినియోగించుకుని పాక్ ను 50 పరుగులే ఆలౌట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. పాకిస్థాన్ కు బుద్ది చెప్పేందుకు నిన్నటి నుంచే టీమిండియా బృందంలో ఈ చర్చ జరిగిందని అంటున్నారు. మరి ఈ బస్తీ మే సవాల్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.
భారత్ అంచనా జట్టు: అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, సంజు శాంసన్ (WK), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
పాకిస్థాన్ : సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హరీస్ (WK), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (c), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్






