ఇవాళ న్యూజిలాండ్ తో 3వ టీ20..ఇవాళ గెలిస్తే చ‌రిత్రే

by velandi.Saikiran |

భారత వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ లో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. చేతికి గాయం అయిన నేపథ్యంలోనే రెండవ టీ20కి దూరమై, ఇవాళ్టి మ్యాచ్ లో మాత్రం ఆడుతున్నాడని స‌మాచారం.

ఇవాళ న్యూజిలాండ్ తో 3వ టీ20..ఇవాళ గెలిస్తే చ‌రిత్రే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత్, న్యూజిలాండ్ మధ్య ఇవాళ 3వ టీ20 జరగనుంది. గువాహటి వేదికగా ఇవాళ సాయంత్రం 7 గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు టీ20లలో వరుసగా గెలిచిన భారత్, 3వ టీ20 పై కన్నేసింది. అటు ఎలాగైనా ఈ టోర్నమెంట్ లో బోణీ కొట్టాలన్న కసితో బ్లాక్ క్యాప్స్ కసిగా కనిపిస్తున్నారు. అయితే ఈ 3వ టీ20 నేపథ్యంలో భారత జట్టుకు కాస్త ఊరట లభించనుంది.

భారత వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ లో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. చేతికి గాయం అయిన నేపథ్యంలోనే రెండవ టీ20కి దూరమై, ఇవాళ్టి మ్యాచ్ లో మాత్రం ఆడుతున్నాడని స‌మాచారం. అదే సమయంలో డేంజ‌ర్ బౌల‌ర్‌ బుమ్రాను కూడా తీసుకుంటారట. మొన్న అర్షదీప్ సరిగ్గా బౌలింగ్ చేయలేదు. దీంతో అతడిని తప్పించి బుమ్రాను తీసుకుంటారని అంటున్నారు. ఇటు అక్షర్ పటేల్ బరిలోకి దిగితే, వరుణ్ చక్రవర్తి లేదా కుల్దీప్‌ పైన వేటు పడే ఛాన్స్ ఉంటుంది.

Next Story